• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గురుకుల హాస్టల్ ఘటనపై స్పందించిన కవిత

JGL: జగిత్యాల ST సంక్షేమ హాస్టల్ ఘటనపై మాజీ MP కవిత సోషల్ మీడియాలో స్పందించారు. విద్యార్థులపై చీపురుతో దాడి జరగడం అత్యంత దారుణమన్నారు. విద్యా శాఖను తన వద్ద ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వంద మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

March 31, 2026 / 01:30 PM IST

కొమ్మెరలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి

MNCL: చెన్నూర్ మండలం కొమ్మెరలో మంగళవారం విద్యుత్ ఘాతంతో జ్యోతి మృతి చెందింది. బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు, ఇప్పుడు తల్లి కూడా దూరమవడంతో అనాథలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరతున్నారు.

March 31, 2026 / 01:30 PM IST

భారీ వర్షానికి నీట మునిగిన మధ్యాహ్న భోజన గది

ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి ప్రభుత్వ పాఠశాలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పాఠశాలలోని మధ్యాహ్న భోజన గది పూర్తిగా నీటమునిగింది. దీంతో వంట సామాగ్రి తడిసిపోయి, భోజన తయారీకి అంతరాయం ఏర్పడింది. వేసవిలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న వర్షాకాలంలో విద్యార్థుల పరిస్థితి ఏమిటని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భోజన గదికి మరమ్మతులు చేపట్టాలన్నారు.

March 31, 2026 / 01:30 PM IST

“బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలి”

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహం ముందు అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

March 31, 2026 / 01:28 PM IST

‘న్యాయవాదుల రక్షణ చట్టం-2026 బిల్లు ఆమోదం’

WNP: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదుల రక్షణ చట్టం-2026 బిల్లు ఆమోదించడం పై వనపర్తి అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా కోర్టు సముదాయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం బిల్లు ఆమోదించడం న్యాయవాదుల రక్షణ చట్టం ద్వారా న్యాయవాదులకు వ్యక్తిగత భద్రత కల్పించడం, భీమ కల్పించడం అభినందనీయం అన్నరు.

March 31, 2026 / 01:26 PM IST

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఎంతో రుణపడి ఉంటామని లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారా గౌడ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలానికి కోటి రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

March 31, 2026 / 01:26 PM IST

చినుకు వర్షానికి చిత్తడైన రోడ్డు

SRD:కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద రోడ్డచినుకు వర్షానికి చిత్తడయింది. గతంలో వేసిన సీసీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు పడ్డాయి. దాంతో వర్షం పడగానే బురదమయమై పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్న బీసీ కాలనీలో కూడా రోడ్డుపై వర్షం నీరు మురికి నీరు నిలిచి దుర్గంధంతో అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

March 31, 2026 / 01:24 PM IST

పద్మారావునగర్‌లో గ్యాస్ కోసం బారులు

HYD: అమెరికా, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ వంట గ్యాస్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. వంట గ్యాస్ కోసం కస్టమర్లు గంటల తరబడి లైన్‌లో ఉండి తీసుకుంటున్నారు. పద్మారావునగర్ HP గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ఉదయం వందల మంది గ్యాస్ కోసం లైన్‌లో వేచి ఉన్నారు. అయినా గ్యాస్ దొరకని పరిస్థితి. మరో వైపు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ కొరత మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

March 31, 2026 / 01:24 PM IST

శోభాయాత్రకు రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

RR: ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శోభాయాత్రకు మాజీ మంత్రిని ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. శోభాయాత్రకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావాలన్నారు.

March 31, 2026 / 01:21 PM IST

మెరుగైన TASK.. నైపుణ్యాలపై శిక్షణ ఉద్యోగాలు

HYD: మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) గణనీయమైన పురోగతి సాధించింది. మూడు త్రైమాసికాల్లో లక్ష్యానికి మించి 156% ఫలితాలు సాధించినట్లు తెలిపింది. విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తూ, కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 359 మందికి జాబ్స్ అందించారు.

March 31, 2026 / 01:21 PM IST

మున్సిపాలిటీలో రూ. 24 కోట్ల బడ్జెట్ ఆమోదం

MDK: రామాయంపేట మున్సిపాలిటీలో రూ. 24 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ రెవిన్యూ ఆదాయం 6 కోట్లుగా పరిగణలోకి తీసుకున్నామని, నగర అభివృద్ధి ద్వారా 15 కోట్ల రూపాయలు, 15వ ఫైనాన్స్ నుంచి కోటి 50 లక్షలు ఆదాయం, స్టేట్ ఫైనాన్స్ ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

March 31, 2026 / 01:18 PM IST

‘బాలల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత’

NGKL: బాలల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో బాలల పరిరక్షణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్మన్ సర్పంచ్ జంబుల శ్రీవాణి హనుమంత్ మాట్లాడుతూ.. బాలల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధి ప్రమీల, పంచాయతీ కార్యదర్శి భానుచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 31, 2026 / 01:15 PM IST

ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి ప్రభుత్వ వైద్యశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గైనకాలజీ, దంత, జనరల్, కంటి, చిన్నపిల్లలు, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానికులు శిబిరానికి హాజరై సేవలు పొందారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, వైద్యాధికారి మాధురి ఉన్నారు.

March 31, 2026 / 01:14 PM IST

గ్యాస్ ఏజెన్సీల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

GDWL: జిల్లాలో గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్‌పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా విషయంలో ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి సిలిండర్ బుకింగ్‌కు 45 రోజుల గ్యాప్ తప్పనిసరి అని, ఆ గడువు పూర్తికాకముందు ఓటిపి రాదని తెలిపారు. గ్యాస్ బుక్ చేసిన వారికి ఏజెన్సీ సిబ్బంది ఇంటికే సిలిండర్ అందజేస్తారని చెప్పారు. 

March 31, 2026 / 01:13 PM IST

BJP హయాంలో మహిళలకు రక్షణకరవు: INC

VKB: మహిళా రక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సంతోషరాజు విమర్శించారు. బంట్వారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. మహిళల భద్రత కోసం తక్షణమే పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

March 31, 2026 / 01:10 PM IST