MDK: రామాయంపేట మున్సిపాలిటీలో రూ. 24 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ రెవిన్యూ ఆదాయం 6 కోట్లుగా పరిగణలోకి తీసుకున్నామని, నగర అభివృద్ధి ద్వారా 15 కోట్ల రూపాయలు, 15వ ఫైనాన్స్ నుంచి కోటి 50 లక్షలు ఆదాయం, స్టేట్ ఫైనాన్స్ ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.