PLD: మాచవరం(మం) కొత్తపాలేనికి చెందిన టీడీపీ క్రియాశీలక సభ్యుడు నల్లబోతుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మంగళవారం పిడుగురాళ్లలో అందజేశారు. నల్లబోతు శ్రీనివాసరావు ఇటీవల యాక్సిడెంట్లో మృతి చెందాడు. టీడీపీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఈ చెక్కును అందజేశారు.