• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్.. లావణ్యకు జరిమానా

SRD: సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంగారెడ్డి మెజిస్ట్రేట్ రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ నెల 25న కొండాపూర్ మండలం మల్లెపల్లి శివారులో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం కోర్టు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.

March 30, 2026 / 06:30 PM IST

ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

BHPL: ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని BHPL కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో ప్రజల నుంచి 70 దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 30, 2026 / 06:30 PM IST

పెద్ద శంకరంపేటలో ఉచిత వైద్య శిబిరం

MDK: పెద్ద శంకరంపేటలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మండల పరిధి ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో పాటు గ్రామ కూడా ఈ ఉచిత శిబిరానికి హాజరై తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో కంటి డాక్టర్లు దీప్తిసింగ్, రమణ, నవీన్ కుమార్, వేణుగోపాల్, సంఘం అధ్యక్షులు నర్సింలు పాల్గొన్నారు.

March 30, 2026 / 06:30 PM IST

పీయూ డిగ్రీ ప్రాక్టికల్స్.. వచ్చే నెలలోనే!

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 6 వ సెమిస్టర్ విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

March 30, 2026 / 06:30 PM IST

నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలి: సామాజిక కార్యకర్త

GDWL: పిల్లిగుండ్ల గ్రామంలోని నిరుపేదలకు కనీస సౌకర్యాలు లేని పూరి గుడిసెలే దిక్కయ్యాయని సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేస్తూ, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలం రాకముందే స్పందించి పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

March 30, 2026 / 06:29 PM IST

కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు

జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ వసంత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె స్వామివారికి ఒడి బియ్యం సమర్పించగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ హరీశ్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వొద్ది శ్రీలత, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

March 30, 2026 / 06:29 PM IST

వికారాబాద్‌లో దంచికొట్టిన వర్షం

VKB: వికారాబాద్‌లో సోమవారం వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేతికొచ్చిన మొక్కజొన్న, ఉల్లి, క్యారెట్ పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.

March 30, 2026 / 06:29 PM IST

‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే’

SRCL: బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

March 30, 2026 / 06:27 PM IST

‘పండుగలా గ్రామసభలు నిర్వహించాలి’

ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సమీక్షలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు.

March 30, 2026 / 06:25 PM IST

రామలింగేశ్వర స్వామికి అన్నపూజ

JN: జనగామ(M) చీటకోడూరు గ్రామంలోని శ్రీ పంచకోసు రామలింగేశ్వర, మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో స్వామి వారికి ఇవాళ అన్నపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

March 30, 2026 / 06:22 PM IST

మున్సిపల్ కార్మికుల వేతనాలపై వినతిపత్రం అందజేత

MLG: మున్సిపల్ కార్మికులకు రూ.22,750 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కమిషనర్, మేయర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ.. కార్మికుల సంఖ్య పెంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్నచూపు చూస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 06:21 PM IST

‘హమాలీ కూలీల సమస్యలు పరిష్కరించాలి’

MNCL: బెల్లంపల్లిలోని వ్యవసాయ మార్కెట్ PDS గోదాం హమాలీల సమస్యలు పరిష్కరించాలని అధ్యక్షుడు రాజలింగు డిమాండ్ చేశారు. సోమవారం హమాలీల సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కూలీరెట్ల పెంపు, పని గంటలు తగ్గించాలని, బరువులు మోసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాల కల్పనలపై సమగ్రంగా చర్చించారు.

March 30, 2026 / 06:19 PM IST

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే

WGL: ప్రతి కార్యకర్తకు BRS పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. KCR నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

March 30, 2026 / 06:18 PM IST

ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలి: సదానందం

NGKL: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎస్టీయూ (STU) సభలో ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘం నేతలు మండిపడ్డారు. జీవో 25ను సవరించి, నిలిచిపోయిన ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నేత సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

March 30, 2026 / 06:11 PM IST

ఐటీఐలో ఉచిత శిక్షణ కోర్సులు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రోబోటిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ వెహికిల్, CNC మిషిన్, CAD డిజైనింగ్ వంటి కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

March 30, 2026 / 06:08 PM IST