MDCL: మాల్కాజిగిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. బాలవాటిక, ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వ్యవస్థల మధ్య గందరగోళం నెలకొంటోందని తెలిపారు. 72 కేంద్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, అనేక కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.
BHNG: ఈరోజు బొమ్మలరామారం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి జాతరలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కర్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
NLG: ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే ప్రజానాట్య మండలి 8వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. చిట్యాల మండలం చినకాపర్తి, వెలిమినేడు, పెదకాపర్తి, ఎలికట్టె గ్రామాల్లో సోమవారం మండల కార్యదర్శి జిట్టా స్వామి, స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
HNK: మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అన్నారు.పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని హానుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్‌లను అన్ని పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాలని రమేష్ కోరారు.
MHBD: నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరగడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ హయాంలో కేసులు ఎదుర్కొని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని కాపాడిన సీనియర్ నేతలకు గుర్తింపు దక్కడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలతో పాటు కార్పొరేషన్ పదవులు భర్తీ చేపట్టాలని కోరుతున్నారు.
SRCL: విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో సమకూర్చారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం అందజేశారు.
PDPL: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఉద్యమకారులు NTPCలోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, వల్లాల మల్లేశం, పోన్నం విజయ్ గౌడ్‌లు ఉన్నారు.
NGKL: వెల్దండ మండలం చెదురుపల్లిలోని పోస్ట్ ఆఫీస్‌ను వేరే చోటికి తరలించడంపై సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ఊరి కార్యాలయం తమకే కావాలని, తరలింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, తిరుపతయ్య గౌడ్ పాల్గొన్నారు.
MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం (R&R) కోసం ప్రభుత్వం మరో రూ.150 కోట్లు విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనితో ఇప్పటివరకు విడుదలైన మొత్తం రూ.400 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్యాకేజీ నిధుల పంపిణీ వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
SRD: బీరంగూడ ప్రభుత్వ ఐటీఐలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ DYFI, SFI, CITU ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్, సీఐ నరేష్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో సీఐటీయూ నేత రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో భూభారతి భూముల రీ సర్వే సోమవారం చేపట్టారు. సంబంధిత అధికారులు మల్కాపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లి శివారులలో సర్వే ప్రారంభించారు. రైతులు గ్రామ సరిహద్దులు నిర్ధారణ చేసే సమయంలో అందుబాటులో ఉండాలని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. ఇందులో సర్వేలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వే లక్ష్మీ సుజాత, సర్వేయర్ నర్సింగరావు, సర్పంచ్ హరీష్ గౌడ్ పాల్గొన్నారు.
SDPT: తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లను ఆత్మ కమిటీ ఛైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC ఛైర్మన్ విజయ్ రెడ్డి ప్రారంభించారు. టోకన్ల విధానంలో సాగే ఈ ప్రక్రియలో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం కొందరు చేసే రెచ్చగొట్టే మాటలను నమ్మవద్దని సూచించారు.
ADB: జంగుగూడ, చిన్నగూడ గిరిజన గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించి ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. వీబీ రాంజీ పథకం రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టం పునరుద్దరణ చేయాలని కోరారు. నాయకులు సచిన్, ఆత్రం జంగు, స్వామి, ఆశన్న, రామన్న, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలం కాచాపూర్‌లో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దళిత నాయకులు పాల్గొని సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
JN: తరిగొప్పుల మండల నూతన తహసీల్దార్‌ను మండల BRS నేతలు కలిశారు. మండలంలోని పలు సమస్యలను తహసీల్దార్ దృష్టికి BRS నేతలు తీసుకెళ్లి సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూమ్లాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.