VKB: వికారాబాద్లో సోమవారం వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేతికొచ్చిన మొక్కజొన్న, ఉల్లి, క్యారెట్ పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.