ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సమీక్షలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు.