ఆసిఫాబాద్ మండలం మాణిక్ గూడ గ్రామంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న భూమి కోతకు శాశ్వత పరిష్కారం లభించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు రూ. 52 లక్షల వ్యయంతో రక్షణ గోడ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. గోడ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
KNR: ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, తగిన ఫిట్మెంట్‌తో PRC ప్రకటించాలని TNGOs ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు రావలసిన పాత DA బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
NZB: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకొవాలని శుక్రవారం వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్ సభలో తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని కించపరిచారాని తనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
JGL: వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్‌లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. గ్రామంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
BHPL: SC యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రెండు పాడి గేదెల కొనుగోలు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు మండల ఇన్‌ఛార్జ్ MPDO శ్రీరామ్మూర్తి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను MPDO కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు.
JNG: స్టేషన్ ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బి. అనిల్ రాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా శుక్రవారం సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆయనను శాలువాతో సత్కరించి, స్వాగతం పలికారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర ప్రభాకర్, కొత్తకొండ గంగాధర్, తదితరులున్నారు.
BDK: మణుగూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం ఆ పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు.
KMM: తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఆన్‌లైన్ సేవలు స్తంభించడంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలు నిలిచిపోయాయి. అధికారిక వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భూముల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ అపాయింట్‌మెంట్‌లు, ఈ-స్టాంప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తిగా భాకరాజు శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల బదిలీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన ఖమ్మం వచ్చారు. ఈ మేరకు స్థానిక స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టగా, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
HNK: హనుమకొండలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి TRP నేతలు పాలాభిషేకం చేశారు. TRP పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీ కుమార్ మాట్లాడుతూ.. TRP పార్టీ పట్టుదల, MLC మల్లన్న కృషితో నేడు మన కులాల లెక్కలు బయటకు వచ్చాయని, మనమంతా కలిసికట్టుగా పనిచేసి బీసీ రాజ్యాధికార స్థాపనకు కృషి చేద్దామని అన్నారు.
WGL: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో విధి నిర్వహణలో అలసత్వం వహించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
SDPT: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఈనెల 22 నుంచి తలపెట్టిన సమ్మెలో అధికారులు, కార్మికులు భాగస్వామ్యం కావాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ ఎంపీ రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అందరూ కలిసి రావాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యాజమాన్య బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడేది లేదని పేర్కొన్నారు.
NGKL: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసనలకు దిగారు. కల్వకుర్తి మండలం మార్చాల పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. “హామీలు అమలు ఎప్పుడు, ఉద్యోగుల కష్టాలు ఎప్పుడు తీరుతాయి” అంటూ గళమెత్తారు. ఈ నిరసనతో పాఠశాల ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.
MBNR: ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చీరల పంపిణీ చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్వ మంజుల శ్రీశైలం, స్థానికులు పాల్గొన్నారు.
NRML: అమావాస్య తిథిని పురస్కరించుకుని పట్టణంలోని కాలభైరవ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. కాలభైరవ స్వామికి అమావాస్య రోజు పూజారి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా భక్తులు తెలిపారు.