BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (కొత్తది)లో ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. SSC, D/B/M.Pharm అర్హత గల 18-35 ఏళ్ల అభ్యర్థులు 100 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు.
BDK: బూర్గంపాడు పోలీసులు ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో భద్రాచలం టౌన్ ఎస్సైగా పనిచేసిన మహేష్, అతని తమ్ముడు ఎస్సై రాణాప్రతాప్‌పై ఈ చర్య తీసుకున్నారు. వ్యాపారం పేరుతో 35 శాతం అధికంగా చెల్లిస్తామంటూ కుమారి అనే మహిళ వద్ద రూ. 1.82 కోట్ల మొత్తం తీసుకుని మోసగించారనే అభియోగంపై ఆ ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HNK: ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కజ్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న సాయంత్రం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో రూ. 8 లక్షల విలువచేసే 20 లాప్టాప్‌లు విద్యార్థులకు అందించినట్లు పేర్కొన్నారు.
NRML: రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆయా ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు జారీ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు నెట్ నుండి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ పరుశురాం నేటి ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు హాల్ టికెట్ లింకును పంపించామని తెలిపారు.
ఉమ్మడి KNR జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. KNRలో 36,426, PDPLలో 10,367, JGTLలో 15,125, SRCLలో 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులు 45 ని.లు ముందే సెంటర్‌కు వెళ్లాలన్నారు.
JN: దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో నేడు అంతరాయం కలుగుతుంది అని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన 700mm WBSC లీకేజీ కారణంగా సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు అని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి మంచి నీటికోసం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు.
MBNR: హన్వాడ పోస్ట్ ఆఫీసులో జిల్లా పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో సమావేశమయ్యారు. సేవింగ్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి, బీమా వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసి అందరూ వినియోగించుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పోస్టుమాస్టర్ చంద్రశేఖర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో రహదారి వేయడానికి వీలుకావడం లేదు. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జన్నారం శివారులోని జింకల పార్కు నుండి రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
RR: చేవెళ్ల మండలంలో భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్ అన్నారు. మండలంలో మొత్తం రైతులు 32,650ల మంది ఫార్మర్ రిజిస్టేషన్‌కు అర్హులుగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని గుర్తించాలని సూచించారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన అభ్యుదయ కవి కొండ లింగారావుకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో. నిర్వాహకులు ఆయనను సార్ తో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు. విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో ఆయన టాప్ 20 విజేతగా నిలిచారు.
ఖమ్మం జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. గ్రామాల్లో ఈసారి అధిక మొత్తంలో సాగు చేసిన మొక్కజొన్న మరో నెలలో చేతికి రానున్న తరుణంలో అకాల వర్షం రైతులను పూర్తిగా నష్టపరిచింది.
SRCL: మండలంలోని నామాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన చందు(21) అనే యువకుడు గూడెం గ్రామం నుండి ఆవునూర్ వైపు పయణిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ చందును సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్ఎచ్‌వో తెలిపారు.
WGL: పర్వతగిరి మండలం, దౌలత్ నగర్ గ్రామంలో చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి,కూతురి విగ్రహంలోని చేతులను కొందరు రాత్రి మద్యం సేవించి దుండగులు ధ్వంసం చేశారు మంగళవారం స్థానికులు తెలిపారు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
SRD: ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు.
VKB: పెద్దేముల్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకు 3 ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.