• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

KMR: పిట్లం మండలం హస్నాపూర్లో విషాదం నెలకొంది. గ్రామలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతూ రాజు సత్యం (41) సోమవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 04:44 PM IST

LOC చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. అయిజ మండలం యాపదిన్నెకు చెందిన రంగారెడ్డికి వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి LOCని ఆయన సోమవారం అందజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 2, 2026 / 04:42 PM IST

వేములపల్లి రవిశంకర్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

BDK: వేములపల్లి రవిశంకర్ గొప్ప వ్యక్తి అని MLA కూనంనేని అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం పట్టణంలో సోమవారం వేములపల్లి రవిశంకర్ దిశాదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై రవిశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 2, 2026 / 04:42 PM IST

కేంద్ర మంత్రి నిధులతో బోర్ మోటారు ఏర్పాటు

SDPT: కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామ బీరప్ప దేవాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా రూ.2 లక్షల వ్యయంతో బోర్ తవ్వించారు. సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:40 PM IST

TTC ఫలితాలు విడుదల: DEO

MHBD: జిల్లాలో జనవరిలో జరిగిన టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ (TCC) ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. https://www.bse.telangana.gov.in ద్వారా అభ్యర్థులకు సంబంధించిన పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫలితాల సందేహాలకు 9849761012ను సంప్రదించాలన్నారు.

March 2, 2026 / 04:40 PM IST

పాఠశాల సమస్యలకు తక్షణ పరిష్కారం హామీ

WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి సోమవారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిస్థితులను, మధ్యాహ్న భోజనం, నీటి సదుపాయం, చెట్ల తొలగింపు వంటి అంశాలను పరిశీలించారు. సమస్యలను అంచనా వేసి, నాణ్యమైన విద్య, భోజనం అందించడానికి తక్షణ చర్యలు తీసుకునే హామీ ఇచ్చారు.

March 2, 2026 / 04:38 PM IST

జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సులో ప్రవేశాలు

KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల 2025-26 సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అభ్యర్థులు మార్చి 10లోగా తెలుగు విభాగంలో దరఖాస్తులు సమర్పించాలి అని ప్రిన్సిపాల్ కే. రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ సూచించారు. మరిన్ని వివరాలకు తెలుగు విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

March 2, 2026 / 04:36 PM IST

బాలల హక్కులపై గ్రామ సభలో అవగాహన

NRPT: ఉట్కూర్ మండలం మల్లేపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా శిశు సంక్షేమ శాఖ కౌన్సిలర్ విజయ్ కుమార్ పాల్గొని బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టం వంటి కీలక అంశాలను వివరించారు. బాల్య వివాహాల సమాచారాన్ని వెంటనే 1098 నంబర్‌కు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:35 PM IST

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు నివాళులు

PDPL: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు.

March 2, 2026 / 04:34 PM IST

‘అర్జీలను వెంటనే పరిష్కరించాలి’

NRPT: ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

March 2, 2026 / 04:34 PM IST

నార్సింగి ఎంపీడీవో బదిలీ

MDK: నార్సింగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) ప్రీతి రెడ్డి బదిలీ అయ్యారు. గత ఐదు నెలలుగా ఇక్కడ సేవలందించిన ఆమెను మనోరాబాద్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. నార్సింగి మండలంలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

March 2, 2026 / 04:34 PM IST

దర్గా పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: MLA

HNK: కాజీపేట దర్గా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దర్గా రైల్వే గేట్ నుంచి కడిపికొండ వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ పనులను సుగుమం చేశామని చెప్పారు.

March 2, 2026 / 04:34 PM IST

65 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

NLG: పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చెక్కులను అందజేశారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 2, 2026 / 04:33 PM IST

కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి సర్వే

MLG: మంగపేట మండల కేంద్రంలోని కోమటిపల్లి గ్రామం నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలోని కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో బ్రిడ్జి నిర్మాణం అవసరమైంది. సర్వే తర్వాత ఎస్టిమేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

March 2, 2026 / 04:32 PM IST

జాతీయస్థాయి క్రీడాకారునికి సన్మానం

SRCL: వేములవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలలో ఉత్తమ ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణును సోమవారం శాలువాతో సన్మానించారు. తమ ఎంపీపీ పదవి కాలంలో ఎంతోమంది యువకులకు, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో ప్రోత్సహించారు.

March 2, 2026 / 04:32 PM IST