• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలి’

NLG: జిల్లా కార్యాలయంలో TSUTF సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు చావా రవి హాజరై మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన వేతన సవరణను 8 ఏళ్లు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. గత ప్రభుత్వ 30 నెలలు ఆలస్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

February 26, 2026 / 08:58 PM IST

కోటగిరిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్

NZB: అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని బోధన్ ఏసీపీ.శ్రీనివాస్ పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో గురువారం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ సర్చ్ నిర్వహించారు. ఇండ్లలో సోదాలు నిర్వహించి నిర్వహించి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఒక ఆటో, 42 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు.

February 26, 2026 / 08:58 PM IST

తప్పోపోయిన గేదెలు.. ఆందోళనలో బాధితులు

KMR: ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట్ మండలం జలాల్ పూర్ గ్రామంలో బిస సంగయ్య, గడ్డం సంగయ్యకు చెందిన గేదెలు గురువారం తప్పిపోయాయి. ఈ గేదెలు ఎవరికైనా తెలిసినా లేదా పరిసర ప్రాంతాల్లో కనిపించినా, బిస సంగయ్య (9010752397), గడ్డం సంతోష్ (9346851890)కు సమాచారం ఇవ్వాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తప్పిపోయిన గేదెల విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు.

February 26, 2026 / 08:53 PM IST

పీజీ మొదటి సెమిస్టర్‌లో ఒకరు డిబార్

NZB: టీయు పరిధిలో ఉమ్మడి జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1906 మంది విద్యార్థులకు గాను 1812 మంది హాజరుకాగా 93మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రని ఆయన పేర్కొన్నారు. ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ డిబార్ అయ్యారని తెలిపారు.

February 26, 2026 / 08:51 PM IST

మైనర్ బాలిక వేధింపుల కేసులో ఇద్దరికి జైలుశిక్ష

SRCL: సిరిసిల్ల పొక్సో కోర్టు మైనర్ బాలికపై 2021లో జరిగిన వేధింపుల కేసులో ఇవాళ ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.

February 26, 2026 / 08:51 PM IST

విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి: వీసీ

మహబూబ్ నగర్: పీయూ ఆడిటోరియం ఫార్మసీ కళాశాలలో IQAC, ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో “గ్రాన్ టూరిస్మో 2.0” ఇన్నోవేషన్ క్యాంపస్ సిరీస్ నిర్వహించారు. వీసీ ప్రొ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమని, విద్యార్థులు కొత్త ఆలోచనలతో స్టార్టప్‌ల వైపు ముందుకు రావాలని సూచించారు. రిజిస్ట్రర్ ప్రో పి రమేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:51 PM IST

వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం కల్లూర్ గూడలో భీంరావు, సుగుణల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:50 PM IST

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన SU రిజిస్ట్రార్

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు. సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.

February 26, 2026 / 08:49 PM IST

నూతన కలెక్టర్‌గా అంకిత్ బాధ్యతల స్వీకారం

BDK: నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్ గురువారం సాయంత్రం ఐడీవోసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 08:49 PM IST

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

NRPT: మక్తల్ మండల పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి.కావేరి, అడిషనల్ కలెక్టర్ డి.అనూష, డీఈవో కే.జ్యోతి, డిప్యుటీ డిఈవో సి.శిరీష, ఏంఈఓ కే.నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు md.అబ్దుల్ ఖదీర్ పాల్గొన్నారు.

February 26, 2026 / 08:48 PM IST

గద్వాలకు నూతన కలెక్టర్ రాక

GDWL: జనగామ నుంచి బదిలీపై గద్వాలకు రానున్న కలెక్టర్ రిజ్వీన్ భాష షేక్‌కు నడిగడ్డ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జనగామ అభివృద్ధిలో ఆయన చూపిన పనితీరును చూసిన స్థానికులు, గద్వాల అభివృద్ధికి కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్ బీఎం సంతోష్ ట్రైబల్ వెల్ఫేర్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 08:48 PM IST

సర్కారు బడిలో సబ్ కలెక్టర్ తనిఖీ

NZB: బోధన్ సబ్ కలెక్టర్ గురువారం సాలంపాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న బేస్‌లైన్, మిడ్‌లైన్ పరీక్షల సరళిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వర్షిత, గంగ, ప్రసాద్ అనే విద్యార్థుల సమాధాన పత్రాలను స్వయంగా తనిఖీ చేసి, వారి అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 08:46 PM IST

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం

KMR: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని కామారెడ్డి జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సంతోష్ స్పష్టం చేశారు. గురువారం ఇబ్రహీంపేట ZPHSలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

February 26, 2026 / 08:46 PM IST

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

KMR: దోమకొండ మండలం అంచనూర్‌లో దోమల బెడద నివారణకు సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలుగా ఫాగింగ్ చేపట్టామని తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇలాంటి చర్యలు కొనసాగించాలని కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 08:44 PM IST

అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కళ్యాణం

NZB: కమ్మర్పల్లి మండలం హస కొత్తూర్ గ్రామంలోని హరిహర క్షేత్రంలో అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, కల్యాణ ఘట్టాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెలిమెల రేవతి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:43 PM IST