• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నాగర్‌కర్నూల్ మండల పరిధిని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గురించి హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 06:31 PM IST

కన్నేపల్లిలో ‘నా ఊరు – నా బాధ్యత’ కార్యక్రమం

ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆలోచన మేరకు ఆదివారం “నా ఊరు – నా బాధ్యత” సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా పాల్గొని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో శ్రమదానం చేశారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న యువత తెలిపారు.

March 1, 2026 / 06:31 PM IST

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: రాకేష్ రెడ్డి

HNK: పట్టణ కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇవాళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ సహకారంతో వైద్య నిర్వహించారు. కాలనీలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 06:30 PM IST

స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న ప్రముఖులు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సమాచార హక్కు శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ లో వేరువేరుగా స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వచ్చిన అతిథులకు పూలమాలతో స్వాగతం చెప్పి గర్భాలయంలో స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 1, 2026 / 06:30 PM IST

రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన పాలకవర్గం

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ తీర్మానంతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి కరీంపేట, పాపయ్య పల్లె ప్రజలకు ఉపశమనం లభించనుంది. పాలకులు మారిన రోడ్డు విస్తరణ చేస్తానని పలుమార్లు వాగ్దానాలు చేసి ఏళ్లు గడిచినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు వెడల్పు తో ప్రమాదాల నివారణ తగ్గుతుందన్నారు.

March 1, 2026 / 06:29 PM IST

‘పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం’

KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సాకారం చేసిందని కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేల్లి వీరయ్య అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం పెద్దమండవలో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశాలు చేశారు. గత ప్రభుత్వం పేదల ఇళ్లపై నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 06:28 PM IST

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన సమ్మయ్య గౌడ్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కాగితోజు స్వర్ణలత గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపా డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

March 1, 2026 / 06:28 PM IST

బాల్కొండ గ్రంథపాలకురాలిగా వరలక్ష్మి

NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ నూతన కేంద్ర పాలకురాలిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన స్వామి ఆర్మూర్ గ్రంథాలయానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలోని పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్‌ను ఆమెకు అప్పగించారు. రీడర్లకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.

March 1, 2026 / 06:27 PM IST

నార్మల్ డైరీ పునరుద్ధరణకై సమీక్ష

NLG: హైదరాబాద్‌లోని నార్ముల్ డెయిరీ ఆర్థిక, పరిపాలనా సమస్యలపై ఇవాళ జరిపిన సమీక్షలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్డీడీబీ ఛైర్మెన్ మీనేష్ షా పాల్గొన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా, ఎన్డీడీబీ వారు సానుకూలంగా స్పందించారు. సంస్థ పునరుద్ధరణే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగిందని వారు తెలిపారు.

March 1, 2026 / 06:27 PM IST

పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు DGP తెలిపారు. CP సన్ ప్రీత్ సింగ్, తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 06:26 PM IST

నర్సంపేటలో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు..?

WGL: నర్సంపేట నియోజకవర్గంలో లక్కీ డ్రాలు, గొలుసుకట్టు పేరుతో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే కొందరు నిర్వాహకులు ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని ప్రజలను మోసగించి లాభం పొందుతున్నట్లు సమాచారం.

March 1, 2026 / 06:25 PM IST

అనుమానితుల వేలిముద్రల తనిఖీ

NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్లో అనుమానితుల వేలి ముద్రలను ప్రత్యేక పరికరంతో వేలిముద్రలను తనిఖీ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వేలిముద్రలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా వస్తువులు, మనుషులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.

March 1, 2026 / 06:25 PM IST

‘కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి’

NRML: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఊట్ల కోటన్న, ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్ను రెగ్యులర్ అధికారిని నియమించాలని, కార్మికుల పెండింగ్ క్లైమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 06:24 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 11 మందిపై కేసులు నమోదు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు చేశారు. మొత్తం 3,150 మంది డ్రైవర్లను తనిఖీ చేయగా, 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.

March 1, 2026 / 06:21 PM IST

చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

PDPL: రామగుండంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఆదివారం ఎల్బీనగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తలసేమియాతో చిన్నారులకు రక్తం దొరకక ఇబ్బంది గురికావద్దని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

March 1, 2026 / 06:18 PM IST