NLG: పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చెక్కులను అందజేశారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.