• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రగతి ప్రణాళిక పై సమావేశం

MDK: మనోహరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఎంపీడీవో ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 6 నుంచి 15 వరకు నిర్వహించే ప్రణాళికలపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి ప్రజా పాలన లో ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు.

March 5, 2026 / 08:35 PM IST

‘నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి’

MNCL: అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కోటపల్లి KGBVలో కొనసాగుతున్న అదనపు తరగతి గదులు, భోజనశాల, వంటశాలల నిర్మాణ పనులు, మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.

March 5, 2026 / 08:34 PM IST

మాదిగ ఉద్యోగులు వేలాదిగా హాజరు కావాలి: మంత్రి

KNR: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించడానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మ.12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 08:34 PM IST

మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలి రావాలి: మంత్రి

KNR: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించడానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మ.12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 08:34 PM IST

సీఎం చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

SRPT: హుజూర్ నగర్ మండల కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం ఆయన పనులను పరిశీలించి, వారం రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారికే పారదర్శకంగా ఇళ్లను కేటాయించాలని అన్నారు.

March 5, 2026 / 08:30 PM IST

​వేం నరేందర్ రెడ్డికి కొర్ర రాంసింగ్ నాయక్ శుభాకాంక్షలు

NLG: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించబడిన వేం నరేందర్ రెడ్డిని దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేందర్ రెడ్డి ఎంపిక పట్ల సర్పంచుల ఫోరమ్ హర్షం వ్యక్తం చేసింది.

March 5, 2026 / 08:30 PM IST

గీత కార్మికులకు పెన్షన్ అందించాలని వినతి

NZB: దర్పల్లి మండల కేంద్రానికి చెందిన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు గురువారం నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు తమ గౌడ వృత్తి చేసుకునే గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికీ, పించిన్ అందించే విధంగా చూడాలని కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్‌లకు వినతి పత్రము అందజేశారు.

March 5, 2026 / 08:30 PM IST

‘కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం’

PDPL: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్ కుమార్ హెచ్చరించారు. GDKభాస్కరరావు భవన్‌లో యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. గతంలో యాజమాన్యంతో జరిగిన మీటింగ్‌లో ప్రస్తావించిన డిమాండ్లను అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:26 PM IST

మహిళలకు సానిటరీ ప్యాడ్ కిట్లు పంపిణీ

SDPT: బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లహరి ఆధ్వర్యంలో గురువారం చిన్నకోడూరు మండలం ఎల్లమ్మ జూలూరు గ్రామంలో మహిళలకు సానిటరీ కిట్లను కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్య క్షురాలు ముద్ధం లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మహిళలకు నెలసరికి వాడే సానిటరీ కిట్స్ విషయంలో అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం మహిళలకు అందజేయడం శుభ పరిణామం అన్నారు.

March 5, 2026 / 08:26 PM IST

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: MLA

BHPL: చెల్పూర్ గ్రామంలో మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలు చెప్పేవి ఒకటేనని మనుషులంతా సోదరా భావంతో ఉండాలన్నారు. మసీదుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 08:25 PM IST

పది పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు వంటగది ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

March 5, 2026 / 08:23 PM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

SRCL: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణా రాష్ట్రం లోని వివిధ క్రీడల పాఠశాలలు: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరంలో 4వ తరగతిలో ఆసక్తి గల బాలబాలికలు ప్రవేశం కల్పించనున్నారు.

March 5, 2026 / 08:21 PM IST

ఐటీడీఏ పీవోకు జేఏసీ వినతిపత్రం

BDK: బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో–3 పునరుద్ధరించి స్థానిక గిరిజనులతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అలాగే 1/70, పిసా చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.

March 5, 2026 / 08:19 PM IST

‘బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి’

NRML: తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ పెంచే ఆమెని వెంటనే అమలు చేయాలని సీఐటీ జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 4016 పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తారు.

March 5, 2026 / 08:15 PM IST

అంతక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRD: కంగ్టి మండలం చాప్టా (బీ) గ్రామంలో గురువారం కరెంట్ షాక్‌తో రైతు బాలాజీ పాటిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంతక్రియల్లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి హాజరై కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పేద రైతు కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

March 5, 2026 / 08:14 PM IST