ADB: తాంసి సబ్ మార్కెట్ పరిధిలోని శనగ రైతులకు మార్కెట్ కమిటీ కీలక సూచన చేసింది. యార్డులో నిల్వలు నిండుకోవడంతో ఏప్రిల్ 9 (గురువారం) నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకురావద్దని కోరారు. నిల్వల తరలింపు అనంతరం తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.