• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అల్లీపూర్లో మిస్సింగ్ కేసు

MDK: శివంపేట్ మండలం అల్లీపూర్లో మంగలి శేఖర్ మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం తన కూతురి పెళ్లి నిర్వహించారు. గురువారం తన భార్య మంగలి లక్ష్మితో జరిగిన గొడవ అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

April 17, 2026 / 10:32 AM IST

వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎంపీ

HNK: తెలంగాణను ఉద్దేశించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కావ్య అన్నారు. పార్లమెంటులో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల త్యాగాలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమని, ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హెచ్చరించారు.

April 17, 2026 / 10:30 AM IST

‘తెలంగాణ ప్రజలకు ఎంపీ క్షమాపణ చెప్పాలి’

BDK: పార్లమెంట్లో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. వందలాది మంది అమరవీరుల ఆత్మ బలిదానాలు, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వాన అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. ఎంపీ బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 17, 2026 / 10:30 AM IST

తేజస్వి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీ

KMM: పార్లమెంట్ వేదికగా బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. 15వ లోక్సభలో తాను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి ఓటు వేశానని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు.

April 17, 2026 / 10:30 AM IST

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నూతన కార్యవర్గం ఎన్నిక

నిర్మల్ జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాల నూతన కార్యవర్గాన్ని గురువారం సాయంత్రం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ అఖిలేష్ సింగ్, కార్యదర్శిగా లక్ష్మణ్, కోశాధికారిగా వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్లు ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

April 17, 2026 / 10:28 AM IST

ORR బ్రిడ్జ్ కింద మృతదేహం లభ్యం

SRD: బొల్లారం పట్టణ శివారులో ORR బ్రిడ్జ్ క్రింద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 30-35 ఏళ్ల వ్యక్తి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని IDA బొల్లారం పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు గుర్తించిన వారు 8712661841, 8712656729 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

April 17, 2026 / 10:20 AM IST

కేజీబీవీలో ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల పంపిణీ

JGL: వెల్గటూర్ కేజీబీవీ కళాశాలలో వృత్తి విద్యా విభాగం విద్యార్థినులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు పంపిణి చేశారు. ఇంటర్ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు ప్రత్యేక అధికారి ఎం. దీపా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణను వొకేషనల్ ట్రైనర్ సంధ్య నిర్వహించారు.

April 17, 2026 / 10:17 AM IST

‘నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించండి’

NRPT: జిల్లా పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో వారి తండ్రులకు పోస్ట్‌కార్డ్ ద్వారా లేఖలు రాయించారు. “నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి రండి” అని పిల్లలు రాసిన ఈ భావోద్వేగ సందేశం ట్రాఫిక్ నిబంధనలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో దోహదపడుతోంది.

April 17, 2026 / 10:13 AM IST

చెట్ల సంరక్షణపై కమిషనర్ శశిధర్ దృష్టి

WNP: పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్‌లో ఉన్న చెట్లకు మున్సిపల్ కమిషనర్ శశిధర్ శుక్రవారం స్వయంగా నీరు పోశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతిరోజూ చెట్లకు నీరు పట్టాలని కార్మికులకు ఆదేశించారు. రోడ్ల శుభ్రతను పరిశీలించి చెత్తను రోజూ తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

April 17, 2026 / 10:12 AM IST

భర్తతో వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత

SRCL: కోనరావుపేట మల్కపేటకి చెందిన మానుక భానుశ్రీ (27) గురువారం సౌదీ అరేబియాలో ఉన్న తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగడంతో ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురై ఆమె 3 సం. కుమారుడి ముందే వీడియో కాల్లోనే ఉరేసుకుంది. భర్త తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి భానుశ్రీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

April 17, 2026 / 10:11 AM IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు

KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలు అధికారుల వెల్లడి ప్రకారం.. కొల్లూరు (బాన్సువాడ) 44.2°C, బీర్కూర్ 44.1, మేనూరు 43.8, బిచ్కుంద 43.7, డోంగ్లి, ఎల్పుగొండ, పిట్లం 43.6, భిక్కనూర్ 43.4, దోమకొండ, ఇసాయిపేట 43.3, బీబీపేట, పుల్కల్ 42.9, సోమూరు, బొమ్మన్ దేవిపల్లి 42.8, మాచాపూర్ 42.7°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

April 17, 2026 / 10:06 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ షెడ్యూల్ విడుదల

MHBD: తొర్రూర్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశలకు ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలలో బీఏ(తెలుగు, ఇంగ్లీష్ మీడియం), బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడత రిజిస్టర్ ప్రక్రియ ఈనెల 17 నుంచి మే 7 కొనసాగుంది. విద్యార్థలు గడువులోపు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలి తెలిపారు.

April 17, 2026 / 10:05 AM IST

బాల్య వివాహ రహిత గ్రామాలుగా ఎంపిక

ADB: ఉట్నూర్ మండలంలోని ఉమ్రి, నాగపూర్, చెరువుగూడ, కామాయిపేట, సాకెర గ్రామాలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించారు. స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో ఐటీడీఏ పీవో అధికారులతో కలిసి ఆయా గ్రామాల ప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ఘనత సాధించిన పంచాయతీలను ఐసీడీఎస్ అధికారులు అభినందించారు.

April 17, 2026 / 10:02 AM IST

​గ్రీన్ వుడ్ స్కూల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

SRPT: హుజూర్‌నగర్‌లోని గ్రీన్ వుడ్ పాఠశాలలో సీఐ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.

April 17, 2026 / 10:02 AM IST

తండ్రి మరణం తట్టుకోలేక కూతురు ఆత్మహత్య

HYD: కుత్బుల్లాపూర్‌లో గుండె కోత మిగిల్చే సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక జ్ఞాన శ్రీ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 31న ఆమె తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 17, 2026 / 10:02 AM IST