• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అభివృద్ధిపై ప్రిన్సిపల్ సెక్రెటరీతో ఎమ్మెల్యే భేటీ

జగిత్యాల పట్టణ అభివృద్ధి అంశాలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (CDMA) శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా UIDF నిధుల విధానాలు, జాప్యాలు, మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వంటి సమస్యలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జగిత్యాలలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

April 16, 2026 / 05:17 AM IST

‘నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించండి’

PDPL: గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో నిన్న ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు తమ తండ్రులకు రోడ్డు భద్రతపై భావోద్వేగంతో లేఖలు రాశారు. “నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించండి, నిబంధనలు పాటించండి” అంటూ పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాన్నారన్నారు.

April 16, 2026 / 05:14 AM IST

దూర్గ నగర్‌లో పోలీసుల కీలక సూచనలు

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్‌లో ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌‌వో రాహుల్ కాంత్ (ఐపీఎస్), DSP జీవన్ రెడ్డి, CI స్వామి పాల్గొని సైబర్ క్రైమ్, షీటీం సేవలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని అధికారులు హెచ్చరించారు.

April 16, 2026 / 05:05 AM IST

బాసర గోదావరిలో మహిళ ఆత్మహత్య

NZB: బాసర గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జన్నెపల్లికి చెందిన కోట గంగామణి(26) భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె మానసికంగా కుంగిపోయి బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. మంగళవారం ఉదయం బయటకు వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం నదిలో దూకింది. నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 16, 2026 / 05:02 AM IST

ధర్నాకు అనుమతి ఇవ్వాలని వినతి

KNR: ఈనెల 17న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ, ఉద్యోగ జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆమె చాంబర్‌లో కలిశారు. జేఏసీ ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డీఏ, పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీల సడలింపులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల పరిష్కారం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలనే డిమాండ్‌తో నిరసన తెలుపనున్నారన్నారు.

April 16, 2026 / 05:01 AM IST

ఉదయం 6 గంటలకే ఉపాధి పనులు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం చేన్నపరావుపల్లిలో ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి గోపాల్ తనిఖీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీల సౌకర్యార్థం ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించాలని సూచించారు. మస్టర్ ఫొటోలను సకాలంలో అప్‌లోడ్ చేయాలని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనుల్లో పారదర్శకత పాటించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు.

April 16, 2026 / 04:44 AM IST

మీసేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాలపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సామాన్య ప్రజల నుంచి సేవల కోసం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రాల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.

April 16, 2026 / 04:35 AM IST

హత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ: డీజీపీ

NLG: రాష్ట్రంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉందని DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాదికి 800 మంది హత్యలకు గురవుతుంటే, 7500 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నకిరేకల్లో ‘అలైవ్ అరైవ్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలన్నారు.

April 16, 2026 / 04:28 AM IST

సైదాపూర్ మండల స్థాయి సమావేశం

KNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు సైదాపూర్ స్థానిక రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, రైతు సంఘాల నాయకులు సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో భూక్యా యాదగిరి కోరారు.

April 16, 2026 / 04:16 AM IST

భిక్కనూర్‌లో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

KMR: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేసి భిక్కనూర్ పోలీస్ స్టేషను తరలించారు. మాజీ ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

April 16, 2026 / 04:06 AM IST

జాతీయస్థాయి స్క్వాష్ పోటీలకు ఇద్దరు ఎంపిక

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన సంద శ్రీ మహి క్రీడాకారిణిగా, సంద మహిపాల్ మేనేజర్‌గా 69వ జాతీయస్థాయి స్క్వాష్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల ఏప్రిల్ 16-22 వరకు న్యూ ఢిల్లీలో జరగనున్నాయి. జాతీయ జట్టుకు శ్రీ మహి, మహిపాల్ ఎంపిక పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 04:01 AM IST

రోడ్డుపై మట్టి కుప్పలు.. ప్రాణాలకు ముప్పు..!

SRPT: సూర్యాపేట పాత జాతీయ రహదారిపై గుంతలు పూడ్చి, మట్టి కుప్పలను రోడ్డుపైనే వదిలేయడం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇసుకపై వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా అపశ్రుతి జరిగితే బాధ్యులెవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారిని శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

April 15, 2026 / 10:24 PM IST

అనంతగిరిలో ఎండలు తీవ్రరూపం..!

SRPT- అనంతగిరి మండలంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి, ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీలకు చేరింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు, కూలీలు మధ్యాహ్నం సమయంలో పనులు తగ్గించి, తరచుగా నీరు తాగాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

April 15, 2026 / 09:48 PM IST

హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

SRD: జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే మొదటి విడత జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిలన చేసి జన గణన సమర్థవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

April 15, 2026 / 09:42 PM IST

చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి కారణం: ఎస్పీ

BDK: రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు, సూచించారు. బుధవారం అశ్వరావుపేటలో నిర్వహించిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనం నడుపుతున్నప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలని, చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు.

April 15, 2026 / 09:41 PM IST