• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వాహనాలపై నిఘా పెంచిన పోలీసులు

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక సెంటర్‌లో పోలీసులు బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానాలు విధించారు. వాహనదారులు పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

April 15, 2026 / 08:18 PM IST

రోడ్డు భద్రతలు పాటిస్తూ గమ్యాలకు చేరుకోవాలి: డీజీపీ

NLG: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ గమ్యాలకు చేరుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బుధవారం నకిరేకల్‌లోని అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.

April 15, 2026 / 08:18 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి’

BHPL: రేగొండ (M) లో ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా JAC కన్వీనర్ పైడిపల్లి రమేష్ హాజరై, మాట్లాడారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని తార్నాక్‌లో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగే సభకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయాలన్నారు.

April 15, 2026 / 08:18 PM IST

‘విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి’

NZB: విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. బుధవారం బోధన్ మండల కేంద్రంలో ఉషోదయ ఇంటర్​ మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం బోధన్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సన్మానించారు.

April 15, 2026 / 08:17 PM IST

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో చింతల వెంకట నర్సయ్య గౌడ్ రేషన్ షాప్‌లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 12.68 క్వింటాల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించి, రేషన్ డీలర్ పై EC, ACT-1955 నిబంధనల ప్రకారం 6-A కేసు నమోదు చేశారు. అలాగే. రేషన్ షాప్‌ను దాతర్ పల్లి డీలర్‌కు అప్పగించినట్లు వివరించారు.

April 15, 2026 / 08:16 PM IST

హోటళ్లపై దాడులు.. గ్యాస్ సిలెండర్లు సీజ్

NZB: పలు హోటళ్లు, తినుబండారాల కేంద్రాలపై పౌరసరఫరాల శాఖ, టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్న 30 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత హోటల్ యజమానులపై కేసులు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ OSD శ్రీధర్ రెడ్డి, DSP శేఖర్ రెడ్డి ఉన్నారు.

April 15, 2026 / 08:14 PM IST

జావేద్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు: భట్టి

KMM: ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జావేద్ మృతి కాంగ్రెస్ పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 15, 2026 / 08:14 PM IST

జిల్లాలో పడిపోయిన భూగర్భ జలం

VKB: వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాల స్థాయి కొన్ని ప్రాంతాల్లో పడిపోయింది. సగటుగా 13.9 మీటర్ల లోతులో నీరు లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, అధికంగా బోర్లు త్రవ్వడం కారణాలుగా భావిస్తున్నారు. నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

April 15, 2026 / 08:13 PM IST

ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య

PDPL: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య, అందుతుందని జిల్లా టోటల్ అధికారి దాసరి కల్పన అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లా నోడల్ అధికారి దాసరి కల్పన విద్యార్థినులను ఈ రోజు సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య, వసతులను అందిస్తున్నట్లు తెలిపారు.

April 15, 2026 / 08:13 PM IST

ఘనంగా జల మహోత్సవ ర్యాలీ

SRPT: తుంగతుర్తి మండల పరిధిలోని దేవునిగుట్టతండాలో మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో జల్ మహోత్సవ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచినీటిని అందిస్తున్న‌ట్లు సర్పంచ్ స్వాతి భాస్కర్ తెలిపారు. అనంతరం ప్రజలకు బోరు నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఆర్వో వాటర్‌పై టెస్టింగ్ చేసి అవగాహన కల్పించారు.

April 15, 2026 / 08:11 PM IST

ట్రాఫిక్ సిగ్నల్స్‌.. చిన్నారుల విద్యకు కొత్త దిశ

MNCL: జిల్లా కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ చిన్నారుల విద్యకు కొత్త దిశను చూపిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు ఇవాళ డీసీపీ భాస్కర్ ను కలిసి తమ చేతులతో రంగురంగుల చిత్రాలలో రూపొందించిన ట్రాఫిక్ సిగ్నల్స్‌, థాంక్యూ పోలీస్ కృతజ్ఞతా సందేశాలను అందజేశారు.

April 15, 2026 / 08:09 PM IST

ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరణ

MBNR: జిల్లా మూడో అదనపు (ఫ్యామిలీ కోర్టు) న్యాయమూర్తిగా ఆంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ కేసుల పరిష్కారానికి వీరు కృషి చేస్తారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

April 15, 2026 / 08:05 PM IST

రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన

VKB: ప్రతి విద్యార్థి రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు పట్టణ మహిళా ఎస్సై పుష్పలత రెడ్డి సూచించారు. ప్రభుత్వ 90 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం సీతారాంపేట్ ప్రాథమిక పాఠశాలలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్‌తో కలిసి నిర్వహించారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలను గౌరవించడం అలవాటు చేసుకోవాలని కోరారు.

April 15, 2026 / 08:04 PM IST

అర్హత లేని లబ్ధిదారుడి నుంచి రికవరీకి ఆదేశాలు

కామారెడ్డి జిల్లా ఫరీద్‌పేట్ గ్రామంలో అర్హత లేకపోయినా సంవత్సరాలుగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడి వ్యవహారం అధికారుల విచారణలో బయటపడింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

April 15, 2026 / 08:04 PM IST

విపత్కర పరిస్థితుల్లోనూ పనిచేస్తాం: ఫైర్ ఆఫీసర్

SDPT: అగ్ని ప్రమాదాల సమయంలోనే కాకుండా ఎలాంటి విపత్తుల్లోనైనా తాము సిద్ధంగా ఉంటామని సిద్దిపేట ఫైర్ ఆఫీసర్ సంధన్న తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఏడాది పొడవునా అప్రమత్తంగా ఉండి సేవలు అందిస్తామన్నారు. వరద ముంపు సమయాల్లోనూ తమ సిబ్బంది కీలకంగా పని చేశారని గుర్తుచేశారు. ఈ నెల 20 వరకు ఈ అవగాహన వారోత్సవాలు జరుగుతాయన్నారు.

April 15, 2026 / 08:02 PM IST