NLG: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ గమ్యాలకు చేరుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బుధవారం నకిరేకల్‌లోని అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.