MNCL: జిల్లా కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ చిన్నారుల విద్యకు కొత్త దిశను చూపిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు ఇవాళ డీసీపీ భాస్కర్ ను కలిసి తమ చేతులతో రంగురంగుల చిత్రాలలో రూపొందించిన ట్రాఫిక్ సిగ్నల్స్, థాంక్యూ పోలీస్ కృతజ్ఞతా సందేశాలను అందజేశారు.