MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో చింతల వెంకట నర్సయ్య గౌడ్ రేషన్ షాప్‌లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 12.68 క్వింటాల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించి, రేషన్ డీలర్ పై EC, ACT-1955 నిబంధనల ప్రకారం 6-A కేసు నమోదు చేశారు. అలాగే. రేషన్ షాప్‌ను దాతర్ పల్లి డీలర్‌కు అప్పగించినట్లు వివరించారు.