BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక సెంటర్లో పోలీసులు బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానాలు విధించారు. వాహనదారులు పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.