VKB: ప్రతి విద్యార్థి రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు పట్టణ మహిళా ఎస్సై పుష్పలత రెడ్డి సూచించారు. ప్రభుత్వ 90 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం సీతారాంపేట్ ప్రాథమిక పాఠశాలలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్‌తో కలిసి నిర్వహించారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలను గౌరవించడం అలవాటు చేసుకోవాలని కోరారు.