KNR: ఈనెల 17న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ, ఉద్యోగ జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆమె చాంబర్లో కలిశారు. జేఏసీ ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డీఏ, పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీల సడలింపులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల పరిష్కారం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలనే డిమాండ్‌తో నిరసన తెలుపనున్నారన్నారు.