నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన సంద శ్రీ మహి క్రీడాకారిణిగా, సంద మహిపాల్ మేనేజర్‌గా 69వ జాతీయస్థాయి స్క్వాష్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల ఏప్రిల్ 16-22 వరకు న్యూ ఢిల్లీలో జరగనున్నాయి. జాతీయ జట్టుకు శ్రీ మహి, మహిపాల్ ఎంపిక పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.