WNP: పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్‌లో ఉన్న చెట్లకు మున్సిపల్ కమిషనర్ శశిధర్ శుక్రవారం స్వయంగా నీరు పోశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతిరోజూ చెట్లకు నీరు పట్టాలని కార్మికులకు ఆదేశించారు. రోడ్ల శుభ్రతను పరిశీలించి చెత్తను రోజూ తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.