ఖమ్మం జయనగర్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి బల్లెపల్లి నుంచి ఖమ్మం వైపు బైక్పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఆగం లోకేష్(17) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మరో యువకుడు పందుల ఫణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.