HYD: నకిలీ నంబర్ ప్లేట్ల వ్యవహారంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. ఒకే నంబర్‌ను రెండు వాహనాలకు వాడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి, నేరాలకు పాల్పడటానికి ఇలాంటి మోసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, నకిలీ నంబర్ ప్లేట్లు వాడితే వాహనాల సీజ్ తప్పదు అన్నారు.