SRCL: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రూపొందించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సిరిసిల్లలో ఆవిష్కరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి. గితే, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, తదితరులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని ఆయన కోరారు.