ప్రకాశం: కొండపిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేజీ మస్తాన్ పరిశీలించాడు. ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది వారాల నుంచి ఉపాధి హామీ కూలీలకు నగదు జమ కాలేదని అన్నారు. పలుగు పారా ఇవ్వలేదని, వేసవిలో పనులు చేస్తున్న టెంట్ కూడా వేయలేదు అన్నారు. ఉపాధి హామీ కూలీలు తమ హక్కులు సాధన కోసం భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు.