KMM: శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఖమ్మం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నందు శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భగీరథ మహర్షి విశిష్టతను కొనియాడారు. సమాజ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.