కృష్ణా: బాపులపాడు మండలం రేమల్లెలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. గ్రామస్తులకు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను సూపర్వైజర్ కె. సుమిత్ర వివరించారు. పోషకాహారం ప్రాముఖ్యత, సమతుల్య ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.