NLR: కోవూరు ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల భవనం శ్లాబ్ దెబ్బతిందని ఎమ్మెల్యేకు చెప్పారు. వేసవి సెలవులు ముగిసి పునః ప్రారంభించేలోపు శ్లాబ్ పనులు, వంటగది నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.