VZM: రాష్ట్రంలో జిత్తులమారి ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గజపతినగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన వైసీపీ గ్రామ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపుతూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.