PDPL: సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఈ నెల 28న ‘చలో విద్యుత్ సౌధ-HYD’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. ఇవాళ GDK ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయి పడిన రూ.50 కోట్లు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.