NRPT: కోయిల్ సాగర్ నుండి మరికల్, మాధ్వార్, అప్పంపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు అధికారులు గురువారం సర్వే నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి ఆదేశాలతో సుమారు 3,000 ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా నూతన కాలువల నిర్మాణానికి ఈ చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు.