MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన పసుల అన్నపూర్ణ (55) తీవ్రంగా గాయపడింది. తీర్థయాత్రలకు వెళ్లిన అన్నపూర్ణ మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగే క్రమంలో రైలు కింద జారీ పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.