SRCL: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను వేములవాడ రూరల్ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లో మట్టిని తరలిస్తుండగా ఫాజుల్ నగర్ వద్ద పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు మట్టిని తరలిస్తున్న టిప్పరు సీజ్ చేశారు. అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.