MNCL: RTO చలానా పేరుతో, శుభాకాంక్షల పేరుతో, వాట్సాప్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవొద్దని మంచిర్యాల DCP భాస్కర్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున ఇలాంటి ఫైళ్లు పంపించడం జరగదన్నారు. ఇలాంటి ఫైల్లు మీ మొబైల్ ఫోన్ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.