• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.34కోట్లు ఆర్థిక నష్టం

W.G: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలకు 2500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.34 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. ప్రధానంగా మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలు దెబ్బతిన్నట్లు వివరించారు.

May 5, 2026 / 08:03 PM IST

రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు: శైలజానాథ్

ATP: నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా జలాల పోరాట సమాలోచన సభలో వైసీపీ నేత సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. గ్రేటర్ రాయలసీమకు జీవనాడి వంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి CM చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

May 5, 2026 / 08:03 PM IST

మంత్రులతో లారీ సుబ్బారాయుడు భేటీ

అన్నమయ్య: చిట్వేల్ మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు లారీ సుబ్బారాయుడు రాష్ట్ర కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులను కలిశారు. మండలంలో నెలకొన్న అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలపై సమగ్రంగా వివరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

May 5, 2026 / 08:03 PM IST

కిశోర వికాసంలో పాల్గొన్న పీడీ

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అంగన్వాడి కేంద్రం -7 నందు మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PD నాగమణి పాల్గొన్నారు. తొలుత ఆమె కిశోర బాలికలతో కలిసి ర్యాలీ చేపట్టారు. కిశోర వికాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు.

May 5, 2026 / 08:02 PM IST

బాధిత కుటుంబానికి GPAI చెక్కు అందజేత

PPM: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరఘట్టం కానిస్టేబుల్‌ పి.రవి కుటుంబానికి ఇవాళ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి GPAI ద్వారా మంజూరైన రూ.20.65 లక్షలను అందజేశారు. అనంతరం కానిస్టేబుల్ సతీమణి లలితకు ధైర్యం చెప్పారు. పిల్లల భవిష్యత్‌కు ఈ నగదును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

May 5, 2026 / 08:02 PM IST

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనపై కమిషనర్ సమీక్ష

NTR: విజయవాడ నగరపాలక సంస్థలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనపై కమిషనర్ ధ్యానచంద్ర కన్సల్టెంట్లతో సమావేశమయ్యారు. నగరానికి వచ్చే 15 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా (రూ.319 కోట్లు), భూగర్భ డ్రైనేజ్ (రూ.733 కోట్లు) ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రం 25%, రాష్ట్రం 25% నిధులు అందించగా, మిగతా 50% మున్సిపల్ బాండ్లు, బ్యాంకుల ద్వారా సమీకరించనున్నారు.

May 5, 2026 / 08:02 PM IST

కలెక్టర్ చొరవ… ఇంటికి చేరిన మహిళ

కోనసీమ: ఉపాధి కోసం ఖతర్ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న కొమరాడకు చెందిన కనకదుర్గ సురక్షితంగా స్వగ్రామం చేరుకున్నారు. అక్కడ యజమానుల వేధింపులు, ఆహార సమస్యలతో సతమతమవుతున్న ఆమె దీనస్థితిని భర్త నాగరాజు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణమే స్పందించి, దౌత్య మార్గాల ద్వారా ఆమెను రప్పించడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు.

May 5, 2026 / 08:02 PM IST

గోవుల రక్షణలో చట్టాలు అతిక్రమించవద్దు: సీపీ

WGL: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ కమిషనరేట్ కార్యాలయంలో గో రక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వాహనాలను వెంబడించడం ప్రమాదకరమని తెలిపారు.

May 5, 2026 / 08:01 PM IST

‘మత్స్యశాఖలో కొత్త నాయకత్వం ఏర్పాటైంది’

SRD: మంబాపూర్ గ్రామంలో ముదిరాజ్ మత్స్యశాఖ నూతన కమిటీ ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులకు జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ ప్రోసీడింగ్ కాపీలు అందజేశారు. అధ్యక్షుడిగా మద్దూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా రొయ్యపల్లి ప్రశాంత్, కార్యదర్శిగా యాట రమేష్ ఎన్నికయ్యారు. సలహాదారుడిగా మద్దూరి సత్యనారాయణతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.

May 5, 2026 / 08:01 PM IST

దళిత భూమి కబ్జాపై ఎస్సీ కమిషన్ విచారణ

VSP: భీమిలి మండలం చేపలుప్పాడలో దళితుని భూమి కబ్జా ఆరోపణలపై ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, రావాడ సీతారాం మంగళవారం పరిశీలించారు. బాధితుడు టి.అప్పలకొండ తెలిపిన వివరాల మేరకు సర్వే నం.51లో 3 ఎకరాలు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఫిర్యాదులపై చర్యలు ఆలస్యం అయ్యాయని కమిషన్ గమనించింది. సర్వే స్పష్టత లేక సమస్య కొనసాగుతోందని పేర్కొంది.

May 5, 2026 / 08:01 PM IST

ఉపాధి హామీ కూలీకి గాయాలు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని లొంక హనుమాన్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో మంగళవారం ఓ మహిళ గాయపడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. లక్ష్మీ అనే మహిళ ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో కాలు విరిగినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

May 5, 2026 / 08:01 PM IST

క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు: మంత్రి

VZM: క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 5వ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇస్తున్నయన్నారు.

May 5, 2026 / 08:01 PM IST

‘వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు అరికట్టాలి’

NRPT: జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలు అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రియాంకను మంగళవారం కలెక్టరేట్లో కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమెకు వినతి పత్రం అందించి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలు, అవకతవకల గురించి వివరించారు.

May 5, 2026 / 08:01 PM IST

సమ్మర్ క్యాంపులను పరిశీలించిన ITDA పిఓ బి.రాహుల్

BDK: వేసవి శిబిరాల్లో నేర్చుకున్న కళలను నిరంతరం సాధన చేస్తేనే భవిష్యత్తులో రాణించవచ్చని ITDA పిఓ బి.రాహుల్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం భద్రాచలం గిరిజన బాలికల పాఠశాల, వికాసం పాఠశాలల్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్, కంప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

May 5, 2026 / 08:00 PM IST

మోదీకి ఘనస్వాగతం పలకాలి: రాంచందర్ రావు

TG: యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తుండటంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకాలని కోరారు. మమతా బెనర్జీ ప్రజల తీర్పుని అంగీకరించాలి కానీ.. ప్రజలను అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదని సూచించారు.

May 5, 2026 / 07:57 PM IST