• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమరవీరులకు జోహార్లు అర్పించిన ఉద్యమకారులు

BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఉద్యమకారుల ఇంఛార్జ్ పొడియం నరేందర్ కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి తదితర అధికారులను సన్మానించారు.

June 2, 2026 / 08:31 PM IST

మోదుకూరు మిల్లుపై ఆకస్మిక తనిఖీలు

కోనసీమ: ఆలమూరు మండలం మోదుకూరులోని సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్స్‌లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, రికార్డులు, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

June 2, 2026 / 08:30 PM IST

రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో 25 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి పూర్తి నివేదిక సిద్ధం చేసి బాధిత రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

June 2, 2026 / 08:30 PM IST

అటవీ శాఖ బేగంపేట సెక్షన్ ఆఫీసర్‌గా పర్వీన్

PDPL: అటవీ శాఖ కమాన్ పూర్ మండలం బేగంపేట సెక్షన్ ఆఫీసర్‌గా నహీదా పర్వీన్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్‌గా  విధులు నిర్వహించిన నరసయ్య కల్వచర్ల సెక్షను బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జన్నారం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న నహీదా పర్వీన్ ఇక్కడి సెక్షన్ ఆఫీసర్గా బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆమె బాధ్యతలను చేపట్టారు.

June 2, 2026 / 08:30 PM IST

ఆటో ప్రమాదం.. పలువురికి గాయాలు

ASR: చింతపల్లి మండలం దబ్బగరువు జంక్షన్ వద్ద మంగళవారం ఆటో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

June 2, 2026 / 08:30 PM IST

వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన

NGKL: చారకొండ మండలంలోని అగ్రహారం తండా గ్రామ పంచాయతీలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సర్పంచ్ నేనావత్ లక్ష్మణ్ నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఉచితంగా నాణ్యమైన మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

June 2, 2026 / 08:29 PM IST

‘ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

KRNL: మంగళగిరిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన SIR వర్క్ షాప్ రాష్ట్ర కురుబ-కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

June 2, 2026 / 08:28 PM IST

యువ మోర్చా అధ్యక్షుడిగా హరినాథ్

ATP: అనంతపురం రూరల్ మండలం బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా బిల్లే హరినాథ్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు తేజేశ్వర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు తరుణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

June 2, 2026 / 08:28 PM IST

యజమానులతో సమావేశమైన కలెక్టర్

CTR: జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షించారు. తర్వాత వారికి పలు సూచనలు చేశారు.

June 2, 2026 / 08:27 PM IST

సూర్యవంశీ ప్రచారం చేస్తున్న బ్రాండ్స్ ఇవే

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ.. కాంప్లాన్, గూగుల్ పే, బీహార్ ఆరోగ్య శాఖ, Sareen Sports సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. సూర్యవంశీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని తమ ప్రచారకర్తగా నియమించుకోవడం కోసం ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి.

June 2, 2026 / 08:27 PM IST

ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

KNR: జమ్మికుంట ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా, ర్యాలీకి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ.. విద్యా రంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని, జీవో 25ను ఉపసంహరించుకోవలన్నారు.

June 2, 2026 / 08:25 PM IST

వీరన్నగుట్టలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

RR: ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొనగా వీరన్నగుట్టలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

June 2, 2026 / 08:23 PM IST

నేడు యాదగిరిగుట్ట దేవస్థానం ఆదాయం ఎంతంటే..!

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మంగళవారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాలతో రూ.13,48,740, VIP దర్శనాలతో రూ.4,57,050, కార్ పార్కింగ్‌తో రూ.4,17,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,24,700, ప్రధాన బుకింగ్స్ ద్వారా రూ.2,29,740, వ్రతాలతో రూ.1,27,000, లీజులతో రూ.6,40,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 40,42,615ల ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.

June 2, 2026 / 08:22 PM IST

జగన్ కాలిగోటికి చంద్రబాబు సరిపోరు: పేర్ని నాని

AP: ఒకప్పుడు కోడి కత్తి అని YCPని విమర్శించిన పవన్.. ఇప్పుడు తెలంగాణకు వెళ్లి చెరువులో పడ్డ కోడిలా కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి పేర్నినాని ఫైరయ్యారు. జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరిపోరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో ప్రజలను TDP మోసం చేస్తోందని, ఇక్కడ రూ.60 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దోచుకోవడం తప్ప కూటమి నేతలకు AP అభివృద్ధి పట్టదని విమర్శించారు.

June 2, 2026 / 08:22 PM IST

మంత్రిని కలిసిన పోలవరం నియోజవర్గ ఇంఛార్జ్

ELR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం నియోజవర్గ ఇంఛార్జ్ బోరగం శ్రీనివాస్ కలిశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని, త్వరలోనే అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు.

June 2, 2026 / 08:22 PM IST