WGL: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ కమిషనరేట్ కార్యాలయంలో గో రక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వాహనాలను వెంబడించడం ప్రమాదకరమని తెలిపారు.