• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘కార్మికులు లేబర్ కార్డులు పొందాలి’

JGL: అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకుని లేబర్ కార్డు పొందాలని రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ రవీందర్ అన్నారు. రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మెట్ పల్లి కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డుల నమోదు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి అసిస్టెంట్ కార్మిక శాఖ అధికారి కృష్ణ సాగర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

May 5, 2026 / 07:45 PM IST

‘ఉద్యోగుల పేరిట మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి’

ADB: ఉద్యోగుల పేరిట మోసం చేసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని 2 టౌన్ CI నాగరాజు మంగళవారం తెలిపారు. ట్రేడింగ్ పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి రూ.కోటి 70 లక్షలను దోచుకున్న సల్మాన్ అనే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన గుడూరు ఉమారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

May 5, 2026 / 07:43 PM IST

డ్రోన్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్

KRNL: ఓర్వకల్లు (మ) చింతలపల్లిలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ పనులను మంగళవారం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు. భూసేకరణ, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా పనుల పురోగతిపై సమీక్షించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్, పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు.

May 5, 2026 / 07:41 PM IST

మధురవాడ డిపోలో ఆర్‌ఎం తనిఖీలు

VSP: APSRTC రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మధురవాడ డిపోను మంగళవారం తనిఖీ చేశారు. శక్తి, దివ్యాంగ శక్తి పథకాల తర్వాత ప్రయాణికులు పెరిగినందున ప్రతి స్టేజీలో బస్సులు ఆపి ఎక్కించాలన్నారు. నిర్లక్ష్యం లేకుండా డ్రైవింగ్ చేసి సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. బస్ స్టేషన్‌లో పరిశుభ్రత, బెంచీలు, ఫ్యాన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

May 5, 2026 / 07:40 PM IST

చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ

AP: కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 18, 19న తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరిగే జంతు బలులను నిషేధించాలని కోరారు. ఏటా ఈ ప్రాంతంలో జరుగుతున్న జంతు బలుల గురించి ఎంతో మంది తనకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వేలాది జంతువులను ఏ కారణం లేకుండానే చంపుతున్నారని పేర్కొన్నారు.

May 5, 2026 / 07:40 PM IST

రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదుకు ఆహ్వానం

NLG: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో కొత్త సభ్యత్వాల నమోదు, వివరాల నవీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, రూ. 1,160 రుసుముతో ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని పాలకమండలి కోరింది. పాత సభ్యులు తమ ఫోన్ నంబర్, చిరునామా వివరాలను కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అప్డేట్ చేసుకోవచ్చు.

May 5, 2026 / 07:40 PM IST

‘ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించండి’

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీలలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించినవారికి ప్రభుత్వం 5% రాయితీ ప్రకటించబడినదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పన్ను చెల్లించేవారు ఈ రాయితీని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

May 5, 2026 / 07:39 PM IST

సెలవుల్లోనూ పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

SRPT: వేసవి సెలవుల్లోనూ అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వయంగా పాఠశాల డాబాపై నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రత, మొక్కల సంరక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్నారు.

May 5, 2026 / 07:36 PM IST

హుజూర్ నగర్‌లో బీజేపీ బైక్ ర్యాలీ

SRPT: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా హుజూర్ నగర్‌లో పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని, ప్రజా వ్యతిరేక శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

May 5, 2026 / 07:35 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.3.24 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవలు ద్వారా రూ.3,24,759 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 389 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 91 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 2276 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.

May 5, 2026 / 07:35 PM IST

వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

KMR: అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టం కలగకుండా వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పీపీసీల వద్ద ధాన్యం తడవకుండా తార్పాలిన్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్వంచ పీపీసీని కలెక్టర్ సందర్శించారు. తూకం, రవాణా ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.

May 5, 2026 / 07:35 PM IST

భార్యపై హత్యాయత్నం.. భర్తకు 7 ఏళ్ల జైలు శిక్ష

NZB: జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్యను వేధించి హత్యాయత్నం చేసిన కేసులో కోర్టు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా విచారణ అనంతరం నిజామాబాద్ మహిళల కోర్టు నిందితుడిని దోషిగా తేల్చిందని జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ పేర్కొన్నారు.

May 5, 2026 / 07:33 PM IST

జనగణనలో స్వీయ నమోదు చేసిన అదనపు కలెక్టర్

MLG: ములుగు కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి ఆన్‌లైన్ ద్వారా జనగణన స్వీయ నమోదు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు https://se.census.gov.inద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని వెల్లడించారు.

May 5, 2026 / 07:33 PM IST

ఘనంగా జనసేన పార్టీ ఇంఛార్జ్ పుట్టినరోజు వేడుకలు

CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఇంఛార్జ్ పొన్న పుట్టినరోజు వింజం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దాము, వీర మహిళ విజయ, సీనియర్ నాయకులు యువరాజ్, హేమ కుమార్, సతీష్, తారక్, సంయుక్త కార్యదర్శి మెదవాడ రాఘవ, బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

May 5, 2026 / 07:32 PM IST

‘భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి’

NGKL: జిల్లా కేంద్రంలోని మంతటి ఎక్స్ రోడ్ దగ్గర గల కన్వెన్షన్ హల్‌లో జరిగిన బీజేపీ సన్నాహక సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.

May 5, 2026 / 07:32 PM IST