PDPL: గ్రామసభల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు. ఆయన ఇవాళ హైదరాబాదు నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
ప్రకాశం: ఒంగోలు ఉప విద్యాధికారిగా మర్రిపూడి (M) ఎంఈవో రంగయ్యను నియమిస్తూ ఆర్జెడి లింగేశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇవి రంగయ్య ఈ రోజు ఒంగోలులో ఉపవిద్యాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉప విద్యాధికారిగా విధులు నిర్వహించిన చంద్రమౌలేశ్వర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఈ స్థానంలో మర్రిపూడి ఎంఈవో రంగయ్యను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
VZM: భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసకు చెందిన దాట్ల సూర్య అప్పలరాజు (87) వృద్ధాప్య సమస్యతో మంగళవారం మృతి చెందారు. మరణించిన తన తండ్రి కోరికను నెరవేర్చాలని కుమార్తె రమాదేవి కార్నియాలను దానం చేశారు. అదే విధంగా ఆయన పార్థివ దేహాన్ని అఖిలభారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ సహకారంతో విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించారు.
ADB: వృక్ష సంపదను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వాల్ పోస్టర్‌ను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ రాబిన్సన్, ఎమ్‌డీ. జావీద్ అన్వర్ సబీమ్, ఫీల్డ్ ఆఫీసర్ గంజివార్ సాయిప్రసాద్, తదితరులు ఉన్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన ‘అఆ’ విడుదలైన నేటికి 10 ఏళ్లు పూర్తయింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, సమంత ‘అనసూయ రామలింగం’ నటన ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సరిగ్గా పదేళ్ల క్రితం (2016 జూన్ 2న) విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ టీవీల్లో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తూనే ఉంది.
నిజామాబాద్ నగరంలోని ఓ శ్మశాన వాటికలో మంగళవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాలుగో టౌన్ పరిధిలోని పద్మశాలి స్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ మృతుడి వివరాలపై ఆరా తీశారు.
PLD: పెదకూరపాడు ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పెదకూరపాడు, అమరావతి CHCల ప్రసూతి వైద్యురాలు సుధారాణి తెలిపారు. మంగళవారం 75 త్యాళ్లూరు, అత్తలూరు PHCలో ప్రతినెల మొదటి మంగళవారం నిర్వహించే ఆశ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలను వివరించారు.
GNTR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై సమీక్షించారు.
SKLM: చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదన్నారు.
AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన బుధవారం PAC సమావేశం జరగనుంది. దీనిలో పార్టీ వ్యవహాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మెగా డీఎస్సీలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న YCP నాయకులు ఆ అంశంపై ఈ మీటింగ్‌లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.
TG: ఎండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు త్వరలోనే కేరళను తాకనుండగా, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు కూడా జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది.
VZM: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా రైలు నంబరు 17244 రాయగడ్-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో సీతానగరం ఎస్సై, ఆర్పీఫ్ బృందంతో పార్వతీపురం నుంచి గజపతినగరం రైల్వేస్టేషను వరకు ప్రయాణికుల సామాన్లలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఫలితంగా ఎటువంటి మత్తు పదార్థాలు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశామని చెప్పారు.
JGL: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో మంత్రి అజాహరుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
IPL ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించడం అన్యాయమంటూ కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. IPL ఫైనల్‌ను తరలించడానికి ప్రధాన కారణం చిన్నస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటమేనని చెప్పారు. అందుకే లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ స్టేడియానికి తరలించినట్లు స్పష్టం చేశారు.
RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి షాద్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పనితీరును సమీక్షించారు. ఫిర్యాదులు, రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక పోలీసింగ్ అందించాలని అధికారులకు సూచించారు. స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీపీ పోలీసు సిబ్బందిని అభినందించారు.