• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వాణిజ్య అవసరాలకు వాడితే కేసులు నమోదు: అశోక్

BHPL: గృహ అవసరాల కోసం అందించే LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్న వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని అన్నారు.

March 13, 2026 / 06:38 PM IST

‘ఇంటెన్సీ రివిజన్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి’

వనపర్తి: స్పెషల్ ఇంటెన్సీ యువర్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీ.ఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీసీలో పాల్గొన్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

March 13, 2026 / 06:38 PM IST

మాజీ డీజీపీ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

AP: మాజీ డీజీపీ HJ దొర మృతిపట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖకు బ్రాండ్ క్రియేట్ చేయడంలో HJ దొర కీలకపాత్ర పోషించారని చెప్పారు. నక్సల్స్ సమస్య పరిష్కరించడంలో సమర్థంగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు.

March 13, 2026 / 06:36 PM IST

పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం

తూ.గో జిల్లా పరిధిలోని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ & పీఎం కిసాన్ యోజన పథకాల కింద గణనీయమైన ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో MLA, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

March 13, 2026 / 06:36 PM IST

ప్రజా సమస్యల వేదిక నిర్వహించిన ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు అధికారులను సంప్రదించినప్పుడు వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

March 13, 2026 / 06:36 PM IST

జాబ్ మేళలో ఇచ్చోడ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ADB: ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ నెల 10న ఆదిలాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందకరమని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. కళాశాల నుండి సుమారు 15 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

March 13, 2026 / 06:35 PM IST

సీఎంను కలిసిన టీడీపీ ఇంఛార్జ్

W.G: అమరావతి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపి ఇంఛార్జ్ వలవల బాబ్జి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.

March 13, 2026 / 06:34 PM IST

నూతన SIను సన్మానించిన.. ఆటో యూనియన్ సభ్యులు

BHPL: గోరికొత్తపల్లి మండల నూతన SI గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయి త్రిలోక్నాథ్ రెడ్డిని శుక్రవారం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆటో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు ఉన్నారు.

March 13, 2026 / 06:33 PM IST

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన ఎంపీడీవో

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం 99 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో మహాలక్ష్మి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని ప్రజలకు వారు సూచించారు.

March 13, 2026 / 06:33 PM IST

ఇంట్లో దొంగల బీభత్సం.. భారీ చోరీ

KMM: కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున నాగళ్ళ వెంకటేశ్వర్లు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వేసవికాలం కావడంతో ఇంటికి తాళం వేయకుండా ఆరుబయట పడుకున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల బీరువాలో ఉన్న లక్ష 18వేల రూపాయలను దొంగలు అపహరించుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 13, 2026 / 06:33 PM IST

డ్రైనేజ్ శుభ్రం చేసిన మున్సిపల్ ఛైర్మన్

KNR: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఇవాళ 4వ వార్డును సందర్శించారు. కొత్తపల్లి ప్రాంతంలో పరిశుభ్రత పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో తన కుటుంబం పని చేసిందని, కార్మికుల సమస్యలు ఏవి ఉన్నా నేరుగా తెలపాలని పేర్కొన్నారు. అనంతరం డ్రైనేజ్ శుభ్రం చేశారు.

March 13, 2026 / 06:32 PM IST

నూతన SIను సన్మానించిన.. కోనరావుపేట గ్రామస్తులు

BHPL: గోరికొత్తపల్లి మండల నూతన SI గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాయి త్రిలోక్నాథ్ రెడ్డిని శుక్రవారం కోనరావుపేట ఉప సర్పంచ్ రాజన్న, మాజీ సర్పంచ్ లింగంపేల్లి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లింగాల మహేందర్ మరిగిద్దె రామారావు రాంపీస శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

March 13, 2026 / 06:32 PM IST

‘రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి’

VZM: జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.

March 13, 2026 / 06:32 PM IST

‘క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో బినామీ పేర్లతో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్న మున్సిపాలిటీ ఉద్యోగి హరిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

March 13, 2026 / 06:31 PM IST

నుచ్చుపొదలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం

ప్రకాశం: పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల అమలుపై అధికారులతో చర్చించి రైతులకు అందుతున్న ప్రయోజనాలపై వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

March 13, 2026 / 06:30 PM IST