• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విపత్తు సమయంలో అధికారులు చర్యలు చేపట్టాలి’

ELR: రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖల అధికారులు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం కలెక్ట‌రేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈనెల 30వ తేదీన చింతలపూడిలో IOCL పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు.

April 28, 2026 / 07:00 PM IST

పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమిపూజ

NZB: మోర్తాడ్ మండలం కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ వారు విరాళం అందించిన స్థలంలోన ఆధిపరా శక్తి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ధ్యానం, శాకాహారం ద్వారా శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

విద్యతోనే కురుబల అభివృద్ధి: మంత్రి

సత్యసాయి: విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని, ఆ సామాజిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కురుబ సామాజిక వర్గీయులతో మంత్రి సమావేశమయ్యారు. కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

‘శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి’

VSP: తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా శ్రీవారి కటాక్షం ఉండాలని కోరారు.

April 28, 2026 / 07:00 PM IST

‘ఇంధన కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

VZM: జిల్లాలో ఇంధన కొరతపై కూటమి ప్రభుత్వం అధికారులతో తప్పుడు ప్రకటనులు ఇప్పిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమావ్వాలని, ఇంధన కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశం

PPM: రుణాల మంజూరులో సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కారించి, రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు కావలసిన బ్యాంకు రుణాలు పెండింగ్ లో ఉండడంపై ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

‘పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరగాలి’

AKP: రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వ్యవసాయ అధికారులు, ఏడీఎలు, హోల్సేల్ డీలర్స్‌తో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఏపీ ఎయిమ్స్ యాప్ అమలులోకి తీసుకొచ్చిందన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

‘వీధి దీపాలు పనులు వేగవంతం చేయాలి’

HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అంజయ్య నగర్ వార్డులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాన్ని సందర్శించి, పౌరుల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్ అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, వీధి దీపాలు, గుంతల మరమ్మతులను వేగవంతం చేయాలని సూచించారు.

April 28, 2026 / 07:00 PM IST

చెరువులో చేపల మృత్యువాత.. స్థానికుల ఇబ్బందులు

KKD: యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో మూడు రోజులుగా చేపల మృతి స్థానికంగా కలవరపెడుతోంది. దీంతో చెరువు నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పరిస్థితి కారణంగా, సమీపంలోని 18 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి నాణ్యతపై ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

April 28, 2026 / 07:00 PM IST

వినియోగదారులకు అవగాహన కల్పించిన కలెక్టర్

NTR: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరిందని కలెక్టర్ డా. జీ.లక్ష్మీశ తెలిపారు. అపోహల వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం ఎటువంటి కొరత లేదన్నారు. ప్రతి రోజు 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతోందని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

April 28, 2026 / 06:59 PM IST

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్‌కు చెందిన రైతు దుర్గం యాదగిరి (50) మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంతో పాటు, ఇతరుల పొలము కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లి పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

April 28, 2026 / 06:59 PM IST

దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

JN: పాలకుర్తి మండలం గుడికుంట తండా గ్రామంలో దుర్గమ్మ పండగ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

April 28, 2026 / 06:56 PM IST

బాల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం: పద్మలత

PLD: నరసరావుపేటలో పల్నాడు జిల్లాను ‘బాల స్నేహపూర్వక జిల్లా’గా తీర్చిదిద్దుతామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కే.జీ. వెంకట పద్మలత తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల సంరక్షణపై శాఖల సమన్వయం అవసరమన్నారు. అంగన్వాడీలు, ఆసుపత్రులను పరిశీలించి లోపాల నివారణకు చర్యలు సూచించారు.

April 28, 2026 / 06:55 PM IST

‘చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’

BDK: సుజాతనగర్ మండలంలో మంగళవారం PCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న TPCC జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు పండించిన పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.

April 28, 2026 / 06:55 PM IST

కొటియా గిరిజనుల అరెస్ట్‌పై సర్కార్ సీరియస్

AP: కొటియా గిరిజనుల అరెస్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. జనగణనకు సహకరించలేదని ఒడిశా పోలీసులు వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మంత్రి సంధ్యారాణి.. సీఎం చంద్రబాబు, ఒడిశా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒడిశా హోంమంత్రితో మాట్లాడాలని హోంమంత్రి అనితకు చంద్రబాబు సూచించారు.

April 28, 2026 / 06:54 PM IST