• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకం’

MNCL: చెన్నూరు మండలం బావురావు పెట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశంలో రాష్ట్ర కార్మిక గనులు శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారన్నారు.

April 29, 2026 / 10:31 AM IST

BRS బలోపేతానికి కష్టపడి పని చేయాలి: ఎర్రబెల్లి

WGL: BRS పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో ముఖ్య నేతలతో ఎర్రబెల్లి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలను, BRS హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

April 29, 2026 / 10:31 AM IST

పెనుకొండలో హృదయ విదారక ఘటన

SS: పెనుకొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మడకశిర రోడ్డులో రోడ్డు ప్రమాదంలో బుధవారం ఒక కుక్కపిల్ల మృతి చెందింది. ఈ ఘటన తర్వాత, తన పిల్ల చనిపోయిన అదే చోట తల్లి కుక్క గంటల తరబడి అక్కడే ఉండి కదలకుండా ఎదురు చూస్తూ కనిపించింది. తన పిల్ల కోసం ఆ కుక్క చూపుతున్న ఆవేదన చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. జంతువుల్లో ప్రేమ, అనుబంధం ఉంటాయని తెలిపారు.

April 29, 2026 / 10:30 AM IST

గుంతల రహదారి.. ప్రయాణికుల నరకయాతన

VZM: డెంకాడ మండలం మోపాడ నుంచి కొండర్రాజుపేట, బంగార్రాజుపేట దారికి వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతింది. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన వారు, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

April 29, 2026 / 10:30 AM IST

కాట్రేనికోనలో వివాహిత ఆత్మహత్యాయత్నం

కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోని తమ్మాయి చెరువుకు చెందిన స్వర్ణ కుమారి(22) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. వేమవరానికి చెందిన ఈమెకు పల్లంకుర్రుకు చెందిన దాసరి ధనుంజయ్ వివాహం కాగా, ఆయన గల్ఫ్ ఉంటున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI అవినాశ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 10:30 AM IST

విద్యా విప్లవానికి మంత్రి లోకేష్ శ్రీకారం: మంత్రి

E.G: రాష్ట్రంలో విద్యా విప్లవానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు మంత్రి లోకేష్ పర్యవేక్షణలో సుమారు 16,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని అత్యంత సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల చదువులకు అనువైన వాతావరణం కల్పించారన్నారు.

April 29, 2026 / 10:30 AM IST

ప్రమాదకరంగా రోడ్డు.. స్థానికుల ఆవేదన

NLR: విడవలూరు మండలం రామతీర్ధం నుంచి లక్ష్మీపురం వెళ్లు రోడ్డు ప్రమాదకరంగా మారింది అనీ బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రులు రోడ్డు మార్జిన్ కనపడక ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. మలుగు వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవని అన్నారు. అధికారుల స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

April 29, 2026 / 10:30 AM IST

వంగూరులో పిడుగుపాటు.. రెండు పాడి గేదలు మృతి

NGKL: వంగూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పిడుగు పడి రెండు పాడి గేదలు మృతి చెందాయి. రైతు పురుగుల శ్యామ్ తన బర్రెలను చెట్టు కింద కట్టేయగా, ఒక్కసారిగా పిడుగు పడటంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.

April 29, 2026 / 10:28 AM IST

విలేకరి హత్య ఘటనపై అన్ని కోణాల్లో విచారణ

CTR: వీ.కోట మండలంలో విలేకరి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిర్ధారించని సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.

April 29, 2026 / 10:28 AM IST

ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్డీవో

WGL: దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం GP పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో పద్మజ ఇవాళ ఆకస్మికంగా పరిశీలించారు. కూలీల హాజరు, మస్టర్ రోల్స్, పని ప్రదేశంలో వసతులను తనిఖీ చేశారు. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని ఆమె అధికారులకు ఆదేశించారు.

April 29, 2026 / 10:28 AM IST

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు..!

KNR: వేసవిలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగి వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. ఈనెల రెండో వారంలో ఉమ్మడి KNRలో ట్రే ధర రూ.115 దాకా ఉండగా, తాజాగా రూ.145కు చేరింది. వాతావరణ మార్పులతో మార్కెట్లో సరఫరా తగ్గడంతో గుడ్ల ధరలు కొండెక్కినట్లు వ్యాపారులు తెలిపారు. మాంసాహార ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

April 29, 2026 / 10:27 AM IST

అనుమానస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని గుంజేడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భూక్య సురేష్ బుధవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 10:25 AM IST

భద్రాచలానికి జియో ట్యాగింగ్ సమస్య

BDK: భద్రాచలం పట్టణంలో డిజిటల్ జనగణనలో సాంకేతిక లోపాలు కలకలం రేపుతున్నాయి. జియో ట్యాగింగ్ సమయంలో ప్రాంతం తెలంగాణకు చెందదన్న సూచనలు రావడంతో ప్రజలు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మ్యాపింగ్ లోపాల వల్ల డేటా నమోదు నిలిచిపోవడంతో అధికారులు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ లోపాల సవరణ కోసం పైస్థాయి అధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం.

April 29, 2026 / 10:20 AM IST

లారీ డైవర్‌పై దాడి.. ఆపై దోపిడి

ప్రకాశం: ఒంగోలు శివారులోని ఆలాస్ హోటల్ వద్ద మంగళవారం లారీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2వేల నగదును దోచుకొని పరారయ్యారు. వలేటివారిపాలెంనకు చెందిన శ్రీనివాసరావు చెన్నై వెళుతూ.. బహిర్భూమికి వెళ్లేందుకు లారీని ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

April 29, 2026 / 10:19 AM IST

జాజిరెడ్డిగూడెం‌లో నేడు విద్యాసాగర్ రావు వర్ధంతి

SRPT: తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు ఆర్.విద్యాసాగర్ రావు వర్ధంతిని బుధవారం ఆయన స్వగ్రామం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో స్థానికులు ఘనంగా నిర్వహించనున్నారు. సాగునీటి రంగంలో అంతర్జాతీయ నిపుణుడైన ఆయన.. నీళ్ల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో విడమర్చి చెప్పి ఉద్యమానికి ఊపిరి పోసిన వారు విద్యాసాగర్ రావు అని స్థానికులు వాపోయారు.

April 29, 2026 / 10:19 AM IST