PPM: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాలో నిర్వహించే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కొమరాడ ఎస్సై ఎం. జగదీష్ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్ర గ్రామంలో శుక్రవారం పర్యటించి, సభా స్థలాన్ని పరిశీలించారు. డిసిసి జిల్లా అధ్యక్షులు దాలినాయుడుతో యాత్రకు సంబంధించిన విషయాలు చర్చించారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ రహదారిపై నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల దృష్ట్యా ఈ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
GNTR: అన్నదాత సుఖీభవా-పీఎం కిసాన్ 2025-26 మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్విహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని, వర్చువల్‌గా వీక్షించారు.
ప్రకాశం: టంగుటూరు మండలంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులు కారణంగా విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. టంగుటూరు టౌన్‌తోపాటు రాయివారిపాలెం, పసుపు కుదురు, అనంతవరం, ఆలకూరపాడు, వెలగపూడి, తాళ్లపాలెం, గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.
AP: ఏపీఐఐసీకి చెందిన 75 వేల ఎకరాలను 22ఏ నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామికవేత్తలు ఒప్పందం చేసుకున్న వాటిని 22ఏ నుంచి తొలగించాలని నిర్ణయించింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో పీఎంఈ జీపీ కింద సాయం చేయాలని, మైక్రో యూనిట్లకు ప్రత్యేక రాయితీలపై రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పట్టణాలు, గ్రామాల్లో కేటగిరీల వారీగా రాయితీ ఇచ్చేందుకు ఆమోదించింది.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.480 కోట్లు మంజూరు చేసింది. ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.380 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.480 కోట్లు మంజూరు చేసింది. ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.380 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
కడప: జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు.
MHBD: జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఇఫ్తార్ విందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాజరై మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రత, త్యాగం, సహనం, సేవా భావానికి ప్రతీక అని, ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో నియంత్రణ, పరస్పర గౌరవం, సోదరభావం పెరుగుతాయని తెలిపారు.
NZB: డిచ్పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్‌ను TGSP అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ శుక్రవారం సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న గెస్ట్ హౌస్, CC రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పునరుద్ధరణ చేయబడిన అడ్మిన్ బిల్డింగ్, RO మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి మొక్కలు నాటారు. కమాండెంట్ పి.సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ పాల్గొన్నారు.
KRNL: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నాడని TDP ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఇవాళ పెద్దకడబూరులో అన్నదాత సుఖీభవ- PM కిసాన్ 3వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 41,992 మంది రైతులకు గాను రూ. 23.85 కోట్లు మంజూరు కాగా.. పెద్దకడబూరు మండలానికి 9,662 మంది రైతులకు రూ.5.58 కోట్లు మంజూరయ్యాయి.
మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి పెంపొందించాలే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతకు ఈ నెల 17 నుంచి 24లోపు https:tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్, విశాఖకు చెందిన పి.ఎస్. నాయుడును పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇంద్రపాల్ సింగ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఉభయ రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై చర్చించారు.
SKLM: కూటమి ప్రభుత్వంలో “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి నరసన్నపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 53 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందగా, ప్రస్తుతం ప్రభుత్వంలో 46 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం కల్పిస్తున్నారని అన్నారు.
కోనసీమ: అంబాజీపేట మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 23,796 మంది రూ.13.82 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.