• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

MHBD: జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.

March 14, 2026 / 08:26 AM IST

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్

SDPT: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. జిల్లాలో 3,32,850 డొమెస్టిక్, 1,500 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని, గతంలో లాగే సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అనవసర భయంతో ఒకేసారి ఎక్కువ సిలిండర్లు బుక్ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

March 14, 2026 / 08:25 AM IST

ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల

సంగారెడ్డి జిల్లాలోని 233 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం నిధులు విడుదల చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4.66 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పాఠశాల భవనాల్లోని అత్యవసర మరమ్మతుల కోసం మాత్రమే వినియోగించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 14, 2026 / 08:25 AM IST

‘ఓటర్ల మ్యాపింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలి’

MBNR: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. HYD నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్ పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

March 14, 2026 / 08:24 AM IST

రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

కోనసీమ: అన్నదాత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా, సుభిక్షంగా ఉంటామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కపిలేశ్వరపురం మండలం, అంగర గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడవ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

March 14, 2026 / 08:23 AM IST

ప్రభుత్వ లాంఛనాలతో హెచ్.జె. దొర అంత్యక్రియలు

TG: మాజీ డీజీపీ హెచ్.జె. దొర అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్.జె. దొర కుటుంబ సభ్యులతో సంప్రదించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌‌కు ఆదేశాలు అందాయి.

March 14, 2026 / 08:22 AM IST

గ్యాస్ సరఫరా పర్యవేక్షిస్తున్నాం: కలెక్టర్

BDK: గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ వివరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ శుక్రవారం పాల్గొన్నారు.

March 14, 2026 / 08:21 AM IST

ద్విచక్ర వాహనాలను అందజేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి సౌత్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వరకు నైట్ పెట్రోలింగ్ కోసం 8 ద్విచక్ర వాహనాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు నిన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్, ఏడీసీపీ మురళీకృష్ణ, సౌత్ డివిజన్ ఇన్‌ఛార్జ్ లతా కుమారి, కృష్ణలంక ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 08:21 AM IST

పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన నియోజకవర్గంలో రైతులు సాగు చేసే పంట పొలాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు వేసిన పంటలను పరిశీలించి, అన్నదాత సుఖీభవ నగదు రైతుల ఖాతాల్లోకి జమ అయిందన్న విషయాన్ని రైతులకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 14, 2026 / 08:20 AM IST

గిరిజన విద్యార్థులు ధైర్యంగా పరీక్ష రాయాలి: పీవో

BDK: ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఏ-గ్రేడ్ సాధించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆకాంక్షించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే గిరిజన విద్యార్థులు మనసులో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. గిరిజన విద్యార్థులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

March 14, 2026 / 08:18 AM IST

‘పది’ విద్యార్థులకు బంపర్ ఆఫర్..!

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు అదనపు సౌకర్యాన్ని కల్పించింది. ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కడ చేయి ఎత్తినా బస్సులు ఆపి, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

March 14, 2026 / 08:18 AM IST

జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగింత

NDL: బేతంచెర్ల మండలం గొర్లగుట్టలో దొరికిన జింక పిల్లను గ్రామస్థులు అటవీ అధికారులకు శుక్రవారం అప్పగించారు. గ్రామానికి చెందిన పార్థసారథి తన పొలంలో జింక పిల్లను గుర్తించాడు. ఆ జింక పిల్లను ఇంటికి తీసుకువచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బనగానపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి మగ్బుల్, బేతంచెర్ల సెక్షన్ అధికారి జయమ్మ జింక పిల్లను స్వీకరించారు.

March 14, 2026 / 08:17 AM IST

జిల్లాలో గ్యాస్ సమస్యలకు కంట్రోల్ రూమ్

ELR: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎటువంటి వంటగ్యాస్ కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే ASO 8919887013, DCSO 9652892425, 7981222542 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.

March 14, 2026 / 08:16 AM IST

దివ్యాంగులకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

NLG: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన పల్స రవికుమార్, పెండెం అంజనేయులకు మంజూరైన స్కూటీలను ఆయన ప్రారంభించి అందజేశారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి ప్రయాణ కష్టాలు తీర్చేందుకు ఇలాంటి ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

March 14, 2026 / 08:15 AM IST

భారీ జీతంలో BELలో ఉద్యోగాలు.. త్వరపడండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 5 మెడికల్ ప్రొఫెసనల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. 3 మెడికల్ ఆఫీసర్, 2 Sr.మెడికల్ ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉండగా.. MBBS, MD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష(బెంగళూరులో), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను తీసుకుంటారు. పోస్టును బట్టి ఏడాదికి రూ.12-15 లక్షల CTC ఉంటుంది.

March 14, 2026 / 08:15 AM IST