TG: మాజీ డీజీపీ హెచ్.జె. దొర అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్.జె. దొర కుటుంబ సభ్యులతో సంప్రదించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు అందాయి.